Box Office: ‘కంగువ’కు దక్కింది, ‘మట్కా’కు దక్కనిది ఏమిటి?
ఈ వారం (నవంబర్ 14వ తేదీన) తెలుగు బాక్సాఫీస్ దగ్గర రెండు సినిమాలు ప్రేక్షకుల తీర్పుకు వచ్చాయి. ఒకటి డబ్బింగ్ సినిమా కంగువ, మరొకటి స్ట్రెయిట్ తెలుగు సినిమా మట్కా
ఈ వారం (నవంబర్ 14వ తేదీన) తెలుగు బాక్సాఫీస్ దగ్గర రెండు సినిమాలు ప్రేక్షకుల తీర్పుకు వచ్చాయి. ఒకటి డబ్బింగ్ సినిమా కంగువ, మరొకటి స్ట్రెయిట్ తెలుగు సినిమా మట్కా . వరుణ్ తేజ్ కు మెగా కాంపౌండ్ హీరో కావడంతో అన్ని వైపుల నుంచి సపోర్ట్ ఉంది. కానీ ఓపినింగ్స్ లేవు. కానీ చిత్రంగా డబ్బింగ్ సినిమా అయినా చాలా చోట్ల కంగువా కు మంచి ఓపినింగ్స్ వచ్చాయి. మట్కా మామూలు వసూళ్లు కూడా సాధించలేకపోయింది. అలాగని కంగువ చిత్రం అద్బుతం ఏమీ కాదు. మట్కాకు వచ్చినట్లుగానే కంగువ సినిమాలకు మార్నింగ్ షో నుంచే డివైడ్ టాక్ వచ్చింది. కానీ ఓపినింగ్స్ బాగున్నాయి. అలాగే వీకెండ్ కు కూడా మల్టిఫ్లెక్స్ లలో అడ్వాన్స్ బుక్కింగ్స్ కనిపిస్తున్నాయి. ఎక్కడుంది తేడా. మన తెలుగు సినిమాని కాదని ఓ డబ్బింగ్ సినిమా వైపుకు ఎందుకు మనవాళ్లు మొగ్గు చూపెడుతున్నారు అనేది ట్రేడ్ ముందు ఓ పెద్ద ప్రశ్నగా మారింది.
కంగువ, మట్కా రెండు సినిమాలు పీరియాడిక్ జానర్ లోనే తెరకెక్కించారు. అయితే ఒకటి బాగా వెనక్కి వెళ్లి రాజుల కాలం నాటి కథ అయితే మరొకటి 80 కాలాన్ని నాటి కథ. అంతేకాదు ఈ రెండు సినిమాలలో వినిపించిన మైనస్ పాయింట్స్ లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ నిలిచింది. ఇంట్రెస్టింగ్ సంగతి ఏమిటంటే ఈ రెండు సినిమాలకు టాప్ మ్యూజిక్ డైరెక్టర్ పనిచేశారు. అందులో కంగువా సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ పనిచేయగా మట్కా సినిమాకి మరో మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్ పనిచేశాడు. మన తెలుగు మ్యూజిక్ డైరక్టర్ తమిళ సినిమాకు చేస్తే, తమిళ మ్యూజిక్ డైరెక్టర్ తెలుగుకు పని చేశారు.
అయితే రిజల్ట్ రెండూ అంతంత మాత్రమే వచ్చినా, ఫాంటసీ లాంటి పీరియడ్ ఫిల్మ్ కదా అని కంగువా వైపు నెగిటివ్ టాక్ వచ్చినా మ్రొగ్గు చూపుతున్నారు. పిల్లలను తీసుకుని కంగువా వెళ్దామని ఆలోచనతో జనం అడ్వాన్స్ బుకింగ్ చేస్తున్నారని తెలుస్తోంది. అదే మట్కా దగ్గరకు వచ్చేసరికి ఇది ఫ్యామిలీలకు పట్టే సినిమా కాదు. మాస్ కు ఎక్కితే నెక్స్ట్ లెవల్ లో ఉండాలి. అప్పుడు బి,సి సెంటర్లలో ఈ సినిమాకు జనం బాగానే వెళ్తారనేది అంచనా.
కలెక్షన్స్ విషయానికి వస్తే...
వరుణ్ తేజ్ హీరోగా కరుణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'మట్కా' చిత్రం తొలి షో నుంచే సినిమాకు నెగెటివ్ టాక్ రావడంతో సినిమా వసూళ్లపై తీవ్ర ప్రభావం పడిందనే చెప్పాలి. ట్రేడ్ నుంచి అందుతున్న లెక్కలు ప్రకారం తొలిరోజు ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా కేవలం రూ.75 లక్షల వసూళ్లను మాత్రమే సాధించిందని తెలుస్తోంది. 'గద్దలకొండ గణేష్' తరువాత 'మట్కా' తో వరుణ్ తేజ్ హిట్ కొడతాడని ఆశించిన ఫ్యాన్స్ కు నిరాశే ఎదురైంది. అనుకున్న ఫలితం రాబట్టలేకపోయింది ఈ సినిమా. ఘని, గాండీవదారి అర్జున, ఆపరేషన్ వాలంటైన్ లాగే ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర నిలబడటం కష్టమే అని అంటున్నారు. అయితే వీకెండ్ లో ఈ సినిమా బి,సి సెంటర్స్ లో ఏమైనా వండర్స్ చేస్తుందనే ఆశ మాత్రం ఉంది.
ఇక తమిళ హీరో సూర్య నటించిన ఫాంటసీ యాక్షన్ డ్రామా కంగువ కలెక్షన్స్ చూస్తే ...మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.40 కోట్లు వసూలు చేసిందని తెలుస్తోంది. శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రం రివ్యూలు అయితే దారుణంగా ఉన్నాయి. బాక్సాఫీస్ వద్ద కంగువ దాదాపు రూ. 22 కోట్ల నికర వసూళ్లు సాధించిందని చెప్తున్నారు. అయితే ఈ సినిమాకు పెట్టిన బడ్జెట్ కు ఇది బాగా తక్కువే. తమిళ వెర్షన్ కు నవంబర్ 14న 37.25 శాతం ఆక్యుపెన్సీని నమోదు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా మాత్రం ఓపినింగ్స్ బాగానే ఉండటంతో చెప్పుకోదగ్గ కలెక్షన్స్ ను మొదటి రోజు ఈ సినిమా సొంతం చేసుకుంది. స్టూడియో గ్రీన్, యువి క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించిన కంగువ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. దాదాపు 300 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించినట్లు సమాచారం. ఈ సినిమా కూడా వీకెండ్ లలో మ్యాజిక్ జరుగుతుందనే ఆశతో చూస్తోంది.
క్రిందటి వారం రిలీజైన క , అమరన్, లక్కీ భాస్కర్ లు మాత్రం బాగానే ఒడ్డున పడ్డాయి దీపావళి కానుకగా వచ్చిన ఈ చిత్రాలలో క సినిమా బాగా వర్కవుట్ అయ్యింది. తక్కువ బడ్జెట్ లో తియ్యటం, మంచి కాన్సెప్ట్ అని పేరు రావడం, ఓపెనింగ్స్ బాగా రావడం సినిమాని హిట్ ట్రాక్ ఎక్కించి ఒడ్డున పడేసింది. అలాగే అమరన్ కు మల్టిప్లెక్స్ లలో మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. దుల్కర్ నటించిన లక్కీ భాస్కర్ కు డీసెంట్ ఓపెనింగ్ వచ్చాయి.
ఏదైమైనా మళ్లీ కల్కి లాంటి మ్యాజిక్ జరగాలి. అది దేవర తో మాగ్జిమం జరిగింది. మళ్లీ పుష్ప 2 వచ్చేదాకా భాక్సాఫీస్ ఇలాగే పడి,లేస్తూ ఉంటుంది. సాలిడ్ గా జనం రావాలంటే మంచి క్రేజ్ ఉన్న ఫిల్మ్ అయ్యిండాలి. సినిమాలో ఎక్స్పెక్టేషన్స్ కు తగ్గ కంటెంట్ ఉండాలి. అలాగే ప్రమోషన్స్ కూడా ఓ రేంజిలో ఉండాలి. ఇక ఈ వారం మట్కా, కంగువ సినిమాలు నిలబడితే థియేటర్స్ మంచి ఫీడింగ్ దొరుకుతుంది. లేకపోతే వారంతా పుష్ప 2 కోసం ఎదురుచూడటం తప్పించి చేయగలిగింది లేదు.