" బడ్డీ" మూవీ రివ్యూ

అల్లూ శిరీష్ చేసిన మరో ప్రయోగం ‘బడ్డీ’. వినూత్న కాన్సెప్ట్‌తో వచ్చిన సినిమా ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించింది. అసలు సినిమా ఎలా ఉందంటే..

By :  Admin
Update: 2024-08-03 08:50 GMT

ఈ శుక్రవారం(2.8.24) పెద్ద సినిమాలు ఏమీ లేకపోవడం వల్ల అల్లు శిరీష్ నటించిన బడ్డీ సినిమా మీద కొంతవరకు ప్రేక్షకులు ఆసక్తి చూపించే అవకాశం ఉంది. సినిమా టైటిల్ తో పాటు, టెడ్డీబేర్ ప్రధాన పాత్రగా సినిమా ఉంటుందని టీజర్స్, ట్రైలర్ ద్వారా అర్థమైంది. హీరో అల్లు శిరీష్ కూడా టెడ్డీబేర్ హీరో, నేను సెకండ్ హీరో అని చెప్పడం జరిగింది. చాలా కాలం క్రితం తీసిన శ్రీరస్తు శుభమస్తు అనే విజయవంతమైన సినిమాలో నటించిన శిరీష్ కి ఇంతవరకు ఒక హిట్ సినిమా లేదు. ఎక్కువమంది ప్రేక్షకులు చూడడానికి టికెట్ ధరలు తగ్గించి ఈ సినిమాను విడుదల చేశారు.

ఈ సినిమా కథ గురించి చెప్పాలంటే తమిళ్‌లో వచ్చిన టెడ్డి సినిమాను రీమేక్ గా వచ్చిన తెలుగు సినిమా కథలో కొన్ని మార్పులు చేర్పులు చేసినట్లు అనిపిస్తుంది. ఇందులో ఆదిత్య రామ్(శిరీష్) పైలట్‌గా పనిచేస్తుంటాడు. ఎయిర్ కంట్రోల్ లో పనిచేస్తున్న పల్లవి(గాయత్రి భరద్వాజ్) తో ప్రేమలో పడతాడు. అయితే పల్లవి ఒక చిత్రమైన సమస్య లో ఇరుక్కుంటుంది. ఆమె ఆత్మ ఒక టెడ్డీబేర్లోకి వెళ్తుంది. ఇక అక్కడి నుంచి పల్లవిని ఆ సమస్య నుంచి బయటపడేయడానికి ఆదిత్య, టెడ్డీబేర్ కలిసి చేసిన ప్రయత్నమే మొత్తం సినిమా కథ.

క్లారిటీ లేని స్క్రీన్ ప్లే

గతంలో ఇలాంటి సినిమాలు కొన్ని వచ్చాయి. ముందుగానే టెడ్డీబేర్ లోకి ఆత్మ దూరడం అన్నదానికి ప్రేక్షకులు ఫిక్స్ అయినప్పటికీ, ఈ సినిమా కొంతవరకే అన్ని వర్గాల ప్రేక్షకులను అల్లరిస్తుంది.తమిళ దర్శకుడు షాన్ ఆంటోన్ తీసిన సినిమా నిడివి తక్కువ అయినప్పటికీ, కొన్ని సాగదీయబడిన సన్నివేశాలు సినిమాను రొటీన్‌గా మారుస్తాయి. సినిమాలో కామెడీ కొంతవరకు వర్కౌట్ అయింది. కానీ అవసరం లేని చోట కూడా కొన్ని అసందర్భ కామెడీ సన్నివేశాలు సినిమా వేగాన్ని తగ్గిస్తాయి. ఒక టెడ్డీబేర్ లోకి ఆత్మ దూరడం అన్న పాయింట్‌ను ప్రేక్షకులు అంగీకరించినప్పటికి, క్లారిటీ లేని స్క్రీన్ ప్లే సినిమాను ఆసక్తికరంగా మలచడంలో విఫలమైంది. సినిమా చాలా వరకు గందరగోళంగా ఉండడం వల్ల ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశం లేదు. సినిమా లో కొన్ని పాత్రలు, ముఖ్యంగా విలన్ అజ్మల్ పాత్ర తేలిపోవడం వల్ల, సినిమా పట్టు తప్పింది. సినిమాలో చూపించిన అతిపెద్ద స్కాం ఇదివరకు చాలా సినిమాల్లో వచ్చింది. అలా తీసిన కొన్ని సినిమాలు కొంతవరకు విజయవంతం అయ్యాయి. దానికి కారణం దర్శకత్వం, స్క్రీన్ ప్లే నడిపిన విధానం. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన మైనస్ పాయింట్ ఏంటంటే సినిమా ఎమోషనల్ గా ప్రేక్షకులకు కనెక్ట్ కాదు. ఎందుకంటే మధ్య మధ్యలో సినిమాను కామెడీ నేపథ్యంలో నడపడమే.

ప్రేక్షకులకు ఎమోషనల్ గా కనెక్ట్ కాలేదు

సినిమా కు లాజిక్ లేకపోవడానికి ప్రేక్షకులు ఒప్పుకున్నప్పటికీ, సినిమా కొంతవరకు గందరగోళంగా ఉండడం వల్ల ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశం లేదు. సినిమాలు కొన్ని పాత్రలు ముఖ్యంగా విలన్ అజ్మల్ పాత్ర తేలిపోవడం వల్ల, సినిమా పట్టు తప్పింది. సినిమాలో చూపించిన అతిపెద్ద స్కాం ఇదివరకు చాలా సినిమాల్లో వచ్చింది. అలా తీసిన కొన్ని సినిమాలు కొంతవరకు విజయవంతం అయ్యాయి. దానికి కారణం దర్శకత్వం, స్క్రీన్ ప్లే నడిపిన విధానం. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన మైనస్ పాయింట్ ఏంటంటే సినిమా ఎమోషనల్ గా ప్రేక్షకులకు కనెక్ట్ కాదు. ఎందుకంటే మధ్య మధ్యలో సినిమాను కామెడీ నేపథ్యంలో నడపడమే. దాంతో హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ తేలిపోయింది. కొంత హాస్యాస్పదంగా కూడా ఉంది.

కనెక్ట్ అయిన కామెడీ

అయితే సినిమా కొంతవరకు బాగుండడానికి కారణం మళ్ళీ కామెడీయే కావడం విశేషం. టెడ్డీబేర్ చేసిన కొన్ని పనులు, టెడ్డీబేర్ డైలాగులు కొంతవరకు సినిమాను నిలబెట్టాయి. శిరీష్ తన నటనతో కొంతవరకు ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తాడు. చాలా చోట్ల చక్కని పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. ఇంతవరకు ఏ సినిమాలో చేయని యాక్షన్ సన్నివేశాలు ఇందులో చేశాడు. అవి కొంతవరకు బాగున్నాయి. తమిళ నటుడు అజ్మల్ ఈ మధ్యకాలంలో తెలుగు సినిమాల్లో విలన్ గా కనబడుతున్నాడు. మంచి ఈజ్ ఉన్న నటుడు. ఇందులో కూడా స్టైలిష్ విలనిజాన్ని ప్రదర్శించాడు. గాయత్రి భరద్వాజ్ ఫ్రెష్ గా కనపడడం కొంత రిలీఫ్ ప్రేక్షకులకి. సినిమా చివరలో అలీ ఎంటర్ కావడం ప్రేక్షకులకు మరింత రిలీఫ్ ఇచ్చింది. ఈ సినిమా మొత్తానికి హీరో టెడ్డీబేర్ కాబట్టి ఆ రకంగా చూస్తే దర్శకుడు టెడ్డీబేర్ ని బాగానే ఉపయోగించినట్లు అర్థమవుతుంది. టెడ్డీబేర్ డైలాగులు కూడా కొన్ని థియేటర్లు పేలుతాయి. క్లైమాక్స్ లో జై బాలయ్య అని మిషన్ గాని పేల్చడం ప్రేక్షకుల్లో విజిల్స్ వేయించింది. సినిమాకి ఫోటోగ్రఫీ కూడా కొంతవరకు పర్వాలేదనిపించే స్థాయిలో ఉంది. హాంకాంగ్ వంటి ప్రదేశాల్లో చిత్రీకరణ బాగుంది. ఇలాంటి సినిమాకు సంగీతం ఎలా ఉన్నా పర్వాలేదు గనుక, అది అలాగే ఉంది.

విజయవంతం అయ్యే అవకాశం ఉంది

చివరగా చెప్పాలంటే ఇది ముందే చెప్పినట్లు పిల్లల సినిమా. చాలా వరకు పిల్లల్ని అలరించవచ్చు. కొంతవరకు పెద్దల్ని కూడా అలరించే అవకాశం ఉంది. కాకపోతే ఇలాంటి సినిమాలు ఇంతకుముందే కొన్ని రావడం, తమిళ సినిమా రీమేక్ కావడం వంటి అంశాలు దీనికి మైనస్ గా మారుతాయి. అయితే ఈ మధ్యకాలంలో పెద్ద సినిమాలు ఏవి రాకపోవడం, వచ్చిన సినిమాలు అంతగా ఆసక్తికరంగా లేకపోవడం వల్ల, క్రమేణ ఈ సినిమాని ప్రేక్షకులు ఆదరించవచ్చు. దాంతో ఈ సినిమాను విజయవంతం అయ్యే అవకాశం ఉంది .

నటీనటులు: గాయత్రీ భరద్వాజ్,అల్లు శిరీష్,అజ్మల్ అమీర్,ప్రిషా సింగ్,శ్రీరామ్ రెడ్డి పొలసానే ... మహేంద్ర, మహమ్మద్ అలీ, ముఖేష్ కుమార్

దర్శకత్వం: సామ్ అంటోన్

కథ: సామ్ అంటోన్,సాయి హేమంత్

సంగీతం: హిప్ హాప్ తమిజా ఆది

సినిమాటోగ్రఫీ: కృష్ణన్ వసంత్

ఎడిటర్: రూబెన్

నిర్మాత: కె.ఇ. జ్ఞానవేల్రాజా

నిర్మాణ సంస్థ: స్టూడియో గ్రీన్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్

విడుదల: 02 ఆగస్టు 2024

Tags:    

Similar News