బాలీవుడ్ నటుడు షారుక్‌ఖాన్‌కు జాతీయ అవార్డు
2023లో విడుదలైన యాక్షన్ చిత్రం 'జవాన్'లో నటనకు పురస్కారం;
బాలీవుడ్ (Bollywood) నటుడు షారుక్‌ఖాన్(Shah Rukh Khan) ను తొలిసారి జాతీయ పురస్కారం వరించింది. ఆయన ఉత్తమ నటుడుగా ఎంపికయ్యారు. 2023లో విడుదలైన ‘జవాన్’ (Jawan) చిత్రంలో ఆయనకు నటనకు ఈ అవార్డుకు ఎంపికయ్యారు. తమిళ దర్శకుడు అట్లీ తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద రూ.1100 కోట్లకుపైగా వసూలు చేసింది.
‘చాలా సంతోషంగా ఉంది’
అవార్డు రావడంపై షారుక్ ఖాన్ ఆనందం వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమం ట్విట్టర్ వేదికనగా స్పందించారు. ‘‘నా ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. ఇవి జీవితాంతం గుర్తుండిపోయే క్షణాలు. నేను ఈ అవార్డుకు అర్హుడినని భావించిన జ్యూరీ సభ్యులకు కృతజ్ఞతలు. ‘జవాన్’ చిత్రబృందానికి నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ దర్శకుడు అట్లీ ఈ చిత్రానికి జాతీయఅవార్డు వస్తుందని మొదటినుంచి నమ్మకంగా ఉన్నారు. నా మూవీ లైఫ్ ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగడానికి నా కుటుంబం ముఖ్య కారణం. నా భార్య, పిల్లలు ఎంతో సహకరిస్తారు. ఒక్కోసారి సినిమా కోసం వారిని విడిచి ఉండాల్సి వస్తుంది అయినప్పటికీ చిరునవ్వుతో భరిస్తుంటారు. జాతీయ అవార్డు అంటే కేవలం విజయం కాదు.. అది మన బాధ్యతలను రెట్టింపు చేస్తుంది. ఇంకా కష్టపడి పనిచేసేలా ఉత్సాహాన్నిస్తుంది. దీన్ని కేవలం ఓ గుర్తింపుగా కాకుండా మరింత కృషి చేయడానికి బలంగా ఉపయోగించుకుంటాను. మంచి చిత్రాలు చేస్తానని మీకు హామీ ఇస్తున్నాను’’ అని ధన్యవాదాలు తెలిపారు.
33 ఏళ్ల కెరీర్‌లో విభిన్న పాత్రలు..
షారుఖ్ 1992లో "దీవానా" సినిమాతో సినీరంగ ప్రవేశం చేశారు. ఈ చిత్రం మంచి హిట్‌ను అందించింది. షారుక్ తన 33 ఏళ్ల సినీ కెరీర్‌లో ఎన్నో పాత్రల్లో నటించారు. ‘డర్’, ‘బాజీగర్’, ‘ దిల్‌సే’, ‘దిల్‌వాలే దుల్హనియా లేజాయెంగే’, ‘కుచ్ కుచ్ హోతా హై’, ‘దేవదాస్’, ‘వీర్-జరా’, ‘కల్ హో న హో’, ‘పహేలి’, ‘స్వదేశీ’ , ‘చెక్ దే ఇండియా’, ‘మై నేమ్ ఈజ్ ఖాన్’, ‘పఠాన్’ వంటి చిత్రాలు షారుక్‌ఖాన్ కెరీర్‌లో మైలు రాళ్లుగా నిలిచాయి. 2005లో ఆయనను పద్మశ్రీ అవార్డు వరించింది.