స్కూల్ జీవితంలో నేను నేర్చుకున్న తొలిపాఠం ఏంటంటే...

బడి వొడిలో... ఒక టీచరమ్మ ‘యథానికలు' : 3

Update: 2024-09-22 04:54 GMT


టీచర్ జీవితం ప్రారంభించాక నేను నేర్చుకున్న ముఖ్యమయిన పాఠం విద్యార్థులను కొట్టకూడదు అని.

  రైలుబడి, పిల్లలకే నాహృదయం అంకితం. అల్లరి పిల్లల్లో అద్భుత మార్పులు....

ఏవి అప్పటికీ నేను చదవలేదు. అలాంటి పుస్తకాలు ఉన్నాయని కూడా తెలియదు. ఉంటాయని చెప్పినోళ్ళు కూడా లేరు.

నా మొదటి జాయినింగ్ ఆర్డర్ పట్టపుపాలెం. అయినా స్కూల్ కాంప్లెక్స్ జరుగుతున్న రోజు జాయిన్ అవ్వటంతో అక్కడ ఉన్న ఎంఈఓ గారు నన్ను, నాతో పాటు ట్రైన్ దిగిన ఆ స్కూల్ అమ్మాయిని, ఆ హెడ్మాస్టర్ సెలవు పెడుతున్నందున పక్కనున్న పల్లెపాలెం పొమ్మన్నారు ఓ వారం రోజులు. 120 మంది విద్యార్థులు. ఇద్దరం అమ్మాయిలం కొత్త అయినా పర్వాలేదని మెచ్చుకున్నారు ఐదవ రోజు వచ్చి. ఆ సార్ వచ్చిన తర్వాతనే నన్ను పట్టపుపాలెం పంపించారు.

ట్రైన్ దిగిన తర్వాతనే ఒకరికొకరo పరిచయమయ్యాం. ఎలా వెళ్లాలని అక్కడున్న టీ బంకులో అడుగుతూ. ఆ అమ్మాయిని వాళ్ళ నాన్నగారు తీసుకొని వచ్చారు. నేను ఒక్కదాన్నే. అప్పటికి రెండు ఇళ్ల నుండి గెంటి వేయబడి ఒంటరిగా బ్రతుకుతూ ఎక్కడకైనా ఒక్కదాన్నే వెళుతుండటం అలవాటు చేసుకున్నాను. తెలియక మండల్ ఆఫీస్ కి వెళ్లి మండల ఆఫీస్ నుంచి రిటన్ ట్రైన్లో వచ్చి అక్కడి దిగాను. వాళ్లు ఒంగోలు నుంచి నేరుగానే ట్రైన్ లో వచ్చి అక్కడ దిగి వ్యాన్ కోసం ఆగేరు.

ఈ సంఘటన జరిగిన తర్వాత మా కం. వెం, తిరుమలరావు సార్లు మాట్లాడటoతో నన్ను సంఘానికి పంపించి, సంఘములో ఉన్న సార్ని పట్టపుపాలెం పంపించారు. అంత దూరం నడిచి వెళ్ళి ,మళ్లీ భోజనానికి వచ్చి మళ్లీ వెళ్లి రావడం కష్టమని కూడా. అప్పుడు ఈ వేలిముద్రలు, ఫేస్ ముద్రలు ఏవి లేవులెండి.

వెంటనే జరిగిన ట్రాన్స్ఫర్లో మా ఎంఈఓ  నన్ను తీసుకెళ్లి ఆ పల్లెపాలెంలో పడేశాడు. మా ఎంఈఓ  నేను పల్లెపాలెం లో ఉండడం మంచిదని, స్కూల్ బాగుపడుతుందని కూడా అనుకున్నారు. 120 మంది విద్యార్థులు ఉన్న పల్లెపాలెం పాఠశాలలో నా ఉద్యోగ జీవిత ఆనందాన్ని అనుభవించడం మొదలైంది.

నూట ఇరవై మంది విద్యార్థులున్న ఆ పాఠశాలలో ఒక పెద్దగది ఒక వరండా. లోపల ప్రధానోపాధ్యాయులు ఒక తరగతి విద్యార్థులు. రెండు బల్లులు మూడు కుర్చీలు. విద్యార్థులకు ఇచ్చే బియ్యము,డప్పులు డోలక్స్( బ్లాక్ బోర్డు స్కీమ్ కింద) నల్లబల్ల పథకం సామాగ్రి ఉండేవి. వరండాలో ఓ టీచరు రెండు తరగతులు. మరో టీచరు రెండు తరగతులు ఉదయం పడమర వైపు సాయంత్రం తూర్పు వైపు నీడను బట్టి. అదే ట్రైన్ అదేనడక. నడక దిశ మారింది. అర కిలోమీటర్ తగ్గింది. మనుషులు దండిగా ఉన్నారు. నాతో పాటు ట్రైన్ దిగి జాయిన్ అయినా పద్మావతి మారిపోయి జయంతి వచ్చింది. జయంతి వచ్చిన తర్వాత మా ఇద్దరి కృషి వల్ల నేను ట్రాన్స్ఫర్ మీద గొల్లపాలెం వెళ్ళేటప్పటికి 270 మంది విద్యార్థులు.

మొదట విద్యార్థులను తరగతులుగా కాకుండా బ్యాచులుగా (అంటే రెండవ తరగతిలో చురుగ్గా ఉన్న విద్యార్థిని మూడులో, మూడులో డల్లర్ గా ఉన్న విద్యార్థిని రెండులో వేసాం. ప్రతి తరగతిలో కూడా రెండు మూడు బ్యాచ్లు ఉండేవి. ఒక్కొక్క తరగతీ లో60, 70 మంది విద్యార్థులు ఉండేవాళ్లు . పాఠశాల తూర్పు సరిహద్దుల్లో ఉన్న వేప చెట్టు, ఉత్తరాన ఉన్న ఇంటి సరిహద్దుల్లో ఉన్న తుమ్మచెట్టు పాఠశాల మూడు వైపులా నీడలు. స్టాండున్న నల్లబల్లలు రెండు, గోడలుకున్న నల్ల బల్లలు నాలుగు పూర్తిస్థాయిలో ఉపయోగించుకున్నాం. ఒక్కొక్క బ్యాచ్లో ఒక్కొక్క సూపర్ విద్యార్థి సహకారం తీసుకునే వాళ్ళం. 4,5 తరగతులలో ఉన్న బ్రైట్ స్టూడెంట్స్ జునియర్ టీచెర్లుగా ఉపయోగించుకున్నాము.4,5 డలర్లు ఈ లోపల చదువుకునేవాళ్ళు. ప్రతిరోజు వెళ్ళగానే 10 పదాలు డిక్టేషన్ తో మొదలు పెట్టేవాళ్ళం. చెప్పడం, కరెక్షన్. మొత్తం బోర్డు మీద రాయడం. ఆ పది పదాలు ప్రతి విద్యార్థి గుణింతాలతో చెప్పగా మిగతా విద్యార్థులు పలుకుతుండేవాళ్ళు. మేము ఇంకొక బ్యాచ్ దగ్గరికి వెళ్ళేవాళ్ళం. బోర్డు తుడవడం. మళ్ళీ డిక్టేషన్, కరెక్షను 4,5 విద్యార్థులు చేసేవాళ్లు.

తరగతిమొత్తానికి పాఠం చెప్పేవాళ్ళం. మళ్ళీ బ్యాచులు, హోమ్ వర్క్ లు అప్పజెప్పించుకోవడాలు. ఇద్దరం ఆ బ్యాచులు చుట్టూ రౌండ్స్ వేసేవాళ్ళం. హెచ్.ఎం కి ఒకే క్లాసు (మూడు.. నాలుగు.. ఐదు.. కంటిన్యూ గా ఉండేది.) ఇద్దరం అలిసిపోవడం అంటూ ఉండేదికాదు మళ్ళీ రైల్వే స్టేషన్ కువచ్చేదాకా. అప్పుడు గొంతునొప్పి తెలిసేది కొద్దిగా. చుట్టుపక్కల ఉన్న తొమ్మిది స్కూల్స్ లో హైయెస్ట్ స్ట్రెంత్ మాదే. ఇద్దరం ఉత్సాహంగా ఉండే వాళ్ళం. నేను ఇంకా. 20 మంది టీచర్లo ఆ రైల్వే స్టేషన్ కు రావాల్సిందే. మాస్టర్లు టీచర్లు దాదాపు సమానంగా ఉండేవాళ్ళం. బోలెడన్ని కబుర్లు, జోకులు.

పల్లెపాలెం విద్యార్థులు నిజంగా మేధావులు


నేను వెళ్లే అంతవరకు విద్యార్థులు రీఫిల్స్ వాడేవాళ్ళు. రీపిల్స్ వద్దు 4, 5వాళ్ళు పెన్నులు. ఒకటి రెండు మూడు వాళ్ళు పెన్సిళ్లు వాడాలన్నాము. ఐదు వాళ్లయితే రెనాల్ట్ పెన్సు రెడ్, బ్లూ, బ్లాక్ కొనడం మొదలుపెట్టారు. ఈ మార్పుకు చాలా ఆశ్చర్యపోయాం. ఒకరి పెన్ను తీసుకుని ఒకరికి ఇచ్చేదాన్ని. నా పెన్ను ఇచ్చేదాన్ని. పెన్నులు మారిపోయేయి. సారీ చెప్పే దాన్ని. ఎవరిపెన్ను వాళ్ళు కష్టపడి మార్చుకునేవాళ్ళు. ఈ గందరగోళం లేకుండా పెన్ లోపల చిన్నకాయితo ముక్క మీద పేరు రాసి పెట్టుకుందాం మేడం అని వెంటనే అమలుజరిపేరు.

అంతరిక్షంలో పెన్ను పడకపోతే పెన్సిల్ తో రాసినట్లు, ఈ పెన్సిల్ ప్రతిపాదన చైనాలో ప్రజల నుండి వచ్చిందని చదివాను ఎక్కడో! విద్యార్థులకు ఈ విషయం చెబితే ఎందుకు పడదనే బోలెడన్ని ప్రశ్నలు నా శక్తికి మించి వచ్చాయి. ప్రతి విద్యార్థికి పుస్తకాలు పెట్టుకోవడానికి సంచి కంపల్సరీ చేశాము. పుస్తకాలు చిల్లా కొల్లలుగా అయిపోతున్నాయని పెన్నులు, పెన్సిళ్ళు కలిసిపోతున్నాయని.

ఉదయం మధ్యాహ్నం డ్యూటీ ప్రకారం చిమ్మేవాళ్ళు. మధ్యాహ్నం సంచులు తీయగానే చేపముళ్ళు కనపడేవి. చేపముళ్ళు ఎలా వస్తున్నాయని బోళ్లంతా ఆశ్చర్యంగా ఉండేది మాకు. ఉదయం శుభ్రంగా చిమ్మేరుగా ఈ చేప ముళ్ళు ఎలా వస్తున్నాయి రా అని చిమ్మే ఓ విద్యార్థిని అడిగాను. ఆ విద్యార్థి నవ్వి చేపలను పొయ్యిలో కాల్చుకుని జేబుల్లో సంచుల్లో వేసు కొచ్చుకుంటారండి అన్నాడు.

పచ్చివా? ఎండువా? అంటే ఏమి ఉంటే అవే అన్నాడు. తినడం ఎప్పుడు చూడలేదంటే, కొంచెం కొంచెం గిల్లుకొని నోట్లో వేసుకుంటారండీ అని అసలు విషయం చెప్పాడు. మేమెంత నవ్వుకున్నామో. అలా తినొచ్చు అని కూడా విద్యార్థుల నుంచి నేర్చుకున్నాం. అరే చేపలు తీసుకురాకండి రా ముళ్ళు గుచ్చుకుంటాయని చెప్పాం మానేశారు. తినడానికి కూడా టైం ఉండేది కాదులే. ఏదో ఒక వర్కు చేస్తుండేవాళ్ళు.

ఒకరోజు తుమ్మ చెట్టు ఇల్లు పిల్లోడు టైం అయినా బడికి రాకుండా ఏడుస్తున్నాడు. ఎందుకని అడిగితే, వాడికి చేప తలకాయ కావాలంటమ్మా. ఉన్నవి రాత్రి తినేసాడు అంది. చేపతల తింటారని (చేపతల తినడం ఆ విద్యార్థి నుంచే నేర్చుకున్న) అప్పటిదాకా తెలియక నేను నోరు వెళ్ళబెట్టాను. .ఆ చేపల వల్లనే అంత పెద్ద ఊరిలో ఒక్క విద్యార్థి కూడా కంటి చూపు లోపం ఉండేది కాదనుకున్నాం. బ్లైండువాళ్ళు ఒక్కరు కూడా లేరు.పెద్దలకు కూడా ఒకళ్ళిద్దరికీ తప్ప కళ్ళజోడు ఎక్కువుగా చూడలేదు. రెండు మూడు పోలియో కేసులున్నాయి పిల్లల్లో పెద్దల్లో.

ఐదో తరగతి విద్యార్థులకు గాంధీ పాఠం చూద్దాం. (సశేషం)



Tags:    

Similar News