హర్యానాలో ముగిసిన పోలింగ్..పోలింగ్ శాతం ఎంతంటే..

హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. శనివారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్‌ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది.

Update: 2024-10-05 13:04 GMT

హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. శనివారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్‌ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. పోలింగ్ శాతం 61గా నమోదైనట్లు సమాచారం. గతంతో పోలిస్తే ఈ సారి పోలింగ్ శాతం కాస్త తగ్గింది. 2019 ఎన్నికల్లో 68 శాతంగా నమోదైంది. రాష్ట్రంలోని మొత్తం 90 స్థానాలకు 1,031 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు.

పారిస్‌ ఒలింపిక్స్‌ డబుల్‌ పతకాలు సాధించిన స్టార్‌ షూటర్ మను బాకర్‌, హర్యానా ముఖ్యమంత్రి, బీజేపీ అభ్యర్థి నాయబ్‌ సింగ్‌ సైనీ, కేంద్రమంత్రులు మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌, కృషణ్‌ పాల్‌ గుర్జార్‌, గుజరాత్‌ గవర్నర్‌ ఆచార్య దేవవ్రత్‌, మాజీ రెజ్లర్‌, కాంగ్రెస్‌ అభ్యర్థి వినేశ్‌ ఫొగాట్, మాజీ ఉప ముఖ్యమంత్రి దుశ్యంత్ చౌటాలా, అత్యంత సంపన్న మహిళ, స్వతంత్ర అభ్యర్థి సావిత్రి జిందాల్‌, తదితర ప్రముఖులు ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ మరోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించాలని ఉవిల్లూరుతోంది. ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ దశాబ్దం కాలం తర్వాత మళ్లీ అధికారంలోకి రావాలని భావిస్తోంది. ఇక బీజేపీ, ఆప్, ఐఎన్‌ఎల్‌డీ-బీఎస్పీ, జేజేపీ-ఆజాద్ సమాజ్ పోటీలో నిలిచిన ప్రముఖ పార్టీలుగా చెప్పుకోవచ్చు.

2 కోట్లకు పైగా ఓటర్లు..

మొత్తం ఓటర్లు 2,03,54,350 మంది. పోలింగ్ కేంద్రాలు 20,632. మహిళా అభ్యర్థులు 101 మంది. 2019 ఎన్నికలో బీజేపీ 40, కాంగ్రెస్ 31, జేజేపీ 10 సీట్లు గెలుచుకున్నాయి. అయితే ఈ సారి ఏ పార్టీ ఎన్ని స్థానాలు దక్కించుకుంటుందో తెలుసుకోవాలంటే కౌంటింగ్ తేదీ 8 వరకు ఆగాల్సిందే.

Tags:    

Similar News