మీరంతకు మీరే వెళ్లండి.. లేదంటే జైలుకే.. ట్రంప్ హెచ్చరిక
30 రోజుల గడువు - వివరాలు నమోదుచేసుకోకపోతే దేశం వీడాలి - లేదంటే జరిమానా, జైలుశిక్ష;
అమెరికా(America) అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అక్రమ వలసదారుల (Illegal immigrants) పట్ల కఠినంగానే వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అగ్రరాజ్యంలో ఉంటున్న అక్రమ వలస దారులను జల్లెడపట్టి తమ దేశాలకు పంపుతున్నారు. ఇప్పటికే మన దేశాలనికి చెందిన కొంతమందిని గుర్తించి వారిని బేడీలు వేసి ఇండియాకు యుద్ధవిమానంలో తీసుకువచ్చింది.
ఈ నేపథ్యంలో మరో రూల్ పాస్ చేసింది. 30 రోజులకు మించి దేశంలో ఉంటున్న విదేశీయులంతా హోం ల్యాండ్ సెక్యూరిటీ వద్ద వివరాలు నమోదు చేసుకోవాలని సూచించింది. వివరాలు నమోదు చేసుకోని వారికి జరిమాన జైలు శిక్ష తప్పదని హెచ్చరించింది.
ఈ విధానం H-1B వీసాలు లేదా విద్యార్థి పర్మిట్‌లపై ఎలాంటి ప్రభావం చూపదని పేర్కొంది. H-1B వీసాపై ఉన్న వ్యక్తి ఉద్యోగం కోల్పోయి, గడువులోగా దేశం విడిచి వెళ్లకపోతే తాము తీసుకునే చర్యలకు గురికాకతప్పదని హెచ్చరించింది. తాము ఎలాంటి చర్య తీసుకోకముందే తామకు తాముగా దేశం వీడాలని (Self-deport) సలహా ఇచ్చింది. తమ టిక్కెట్‌కు డబ్బులు చెల్లించలేని వ్యక్తులు సబ్సిడీ విమాన ప్రయాణానికి కూడా అర్హులని పేర్కొంది. వివరాలు నమోదుచేసుకోని వారు భవిష్యత్తులో అమెరికాలో తిరిగి అడుగు పెట్టే అవకాశం కూడా ఉండదని సూచించింది.