విమానాశ్రయాల్లో భద్రతపై అమిత్ షా సమీక్ష
ఇండో-పాక్ సరిహద్దు, విమానాశ్రయాలలో భద్రతపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. ఉన్నతాధికారులతో సమీక్షిస్తున్నారు. జమ్మూలోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి చొరబాటు ప్రయత్నాన్ని భగ్నం చేశామని, కనీసం ఏడుగురు ఉగ్రవాదులను చంపామని మరియు పాకిస్తాన్ రేంజర్స్ పోస్టును ధ్వంసం చేశామని సరిహద్దు భద్రతా దళం ప్రకటించిన కొన్ని గంటల తర్వాత ఈ సమావేశం జరిగింది. భారతదేశం-పాకిస్తాన్ సరిహద్దులో భద్రతా పరిస్థితిని సమీక్షించడంతో పాటు, దేశవ్యాప్తంగా విమానాశ్రయాలలో భద్రతను కట్టుదిట్టం చేయడానికి తీసుకున్న చర్యలను కూడా షా సమీక్షించారని కేంద్ర మంత్రిత్వశాఖ వర్గాలు తెలిపాయి.
Update: 2025-05-09 08:24 GMT