ప్రధాని మోదీ మాట నిలబెట్టుకున్నారు: బీజేపీ నేత

ఇండియా, పాకిస్థాన్ మధ్య జరిగిన కాల్పుల విరమణ ఒప్పందంపై బీజేపీ నేత సయ్యద్ షహ్నవాజ్ హుస్సేన్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ తన మాట నిలబెట్టుకున్నారని అన్నారు. ‘‘చెప్పిన మాట ప్రకారం పాకిస్థాన్‌కు నయం కాని గాయాన్ని ఇచ్చారు. ఇండియా పాక్‌లోని 9 ఉగ్రశిబిరాలను, 11 ఎయిర్‌బేస్‌లను పేల్చేసింది. 100 మందికి పైగా ఉగ్రవాదులను హతమార్చింది. 50 సైనికులు మరణించారు. కాల్పుల విరమణ కోసం పాకిస్థాన్ అడ్డుకుంది. అయినా ఆపరేషన్ సిందూర్ ఇంకా పూర్తి కాలేదు. ఈ దేశం మన సైన్యం, ప్రధాని విషయంలో చాలా గర్వంగా ఉంది’’ అని ఆయన అన్నారు.

Update: 2025-05-12 08:47 GMT

Linked news