32 విమానాశ్రయాలను రీఓపెన్
పాక్‌తో ఉద్రిక్తతల నడుమ భారత సివిల్ ఏవియేషన్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని 32 సివిలియన్ విమానాశ్రయాలను మే 15 వరకు మూసివేస్తున్నట్లు ప్రకటించింది. కాగా ప్రస్తుతం కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన నేపథ్యంలో వాటిని తిరిగి ఓపెన్ చేసినట్లు ప్రకటించింది. అంతేకాకుండా ప్రయాణికులు తమ ఫ్లైట్స్‌కు సంబంధించి సమాచారం కోసం నేరుగా సదరు సంస్థను కాంటాక్ట్ చేయాలని, ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ పొందడానికి అధికారిక వెబ్‌సైట్లు వినియోగించాలని ఇండియా ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ప్రకటించింది.
Update: 2025-05-12 07:13 GMT