జమ్మూలోని 5 సరిహద్దు జిల్లాల్లో తరలింపు చర్యలు

భారత్, పాకిస్థాన్ మధ్య దాడులు పునఃప్రారంభం అయ్యాయి. దీంతో పాకిస్థాన్‌తో సరిహద్దు పంచుకుంటున్న ఐదు జమ్మూకశ్మీర్ జిల్లాల్లోని ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అధికారులు. ఈ ప్రాంతాల్లో కాల్పులు తీవ్రతరం అవుతున్నాయి. ఇప్పటి వరకు 18 మంది మరణించగా 60 మంది గాయపడ్డారు.

ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, ఉప ముఖ్యమంత్రి సురిందర్ చౌదరి, మంత్రి సతీష్ శర్మతో కలిసి జమ్మూ, రాజౌరి, సాంబా జిల్లాల్లోని సహాయ శిబిరాలను సందర్శించి, ఏర్పాట్లను పర్యవేక్షించారు. నిర్వాసితులైన కుటుంబాలకు భరోసా ఇచ్చారు. "రాజౌరి-పూంచ్ బెల్ట్ నుండి ఎనిమిది నుండి పది వేల మంది సరిహద్దు నివాసితులను తరలించారు" అని శర్మ చెప్పారు.

Update: 2025-05-09 19:18 GMT

Linked news