హర్యానా పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్ష వాయిదా

హర్యానా పబ్లిక్ సర్వీస్ కమిషన్ (HPSC) మే 11న జరగాల్సిన పరీక్షలను వాయిదా వేసింది. ఈ మేరకు సమాచారన్ని అధికారులు వెల్లడించారు. ఇండియా, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తత నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా కెమిస్ట్రీ, ఫిజిక్స్ సబ్జెక్టులకు కాలేజ్ కేడర్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల కోసం ఈ పరీక్షలు నిర్వహించాల్సి ఉందని కమిషన్ ప్రతినిధి తెలిపారు. మొదట మే 11న జరగాల్సిన ఈ పరీక్షలు ఉదయం, సాయంత్రం సెషన్లలో జరగాల్సి ఉండగా, ఇప్పుడు తదుపరి నోటీసు వచ్చే వరకు వాయిదా పడ్డాయి.

Update: 2025-05-09 17:07 GMT

Linked news