కూటమి అభ్యర్ధుల ప్రభంజనం.. కొస్తా జిల్లాల వారీగా ఏ పార్టీ ఆధిక్యంలో ఉందంటే.?
తూర్పుగోదావరిలో 13 టీడీపీ ఉంటే.. జనసేన 5, వైసీపీ 1 ఆధిక్యంలో కొనసాగుతోంది.
అటు పశ్చిమగోదావరి జిల్లాలో టీడీపీ 8, జనసేన 5, వైసీపీ 2 ఆధిక్యంలో ఉన్నాయి.
ఉమ్మడి విశాఖపట్నం జిల్లా పరిశీలిస్తే.. టీడీపీ 8, జనసేన 4, వైసీపీ 2, బీజేపీ 1 స్థానాల్లో లీడింగ్‌లో ఉన్నాయి.
శ్రీకాకుళంలో టీడీపీ 8, బీజేపీ 1, వైసీపీ 1లో ఉన్నాయి.
విజయనగరం(9)లో: టీడీపీ 7, జనసేన 1, వైసీపీ 1 స్థానాల్లో,
కృష్ణా(16)లో: టీడీపీ 13, జనసేన 1, బీజేపీ 2 స్థానాల్లో,
గుంటూరు(17)లో: టీడీపీ 16, జనసేన 1 స్థానంలో లీడ్‌లో ఉన్నారు.
అటు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వైసీపీ ఖాతా తెరవలేదు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అమలాపురం, విజయవాడ, గుంటూరు, నరసరావుపేట, బాపట్ల, నంద్యాల, కర్నూలు, అనంతపురం, హిందూపురం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో టీడీపీ లీడింగ్‌లో కొనసాగుతోంది. అటు బీజేపీ వచ్చేసి.. అనకాపల్లి, రాజమండ్రి, నరసాపురం.. కాకినాడ, మచిలీపట్నం స్థానాల్లో జనసేన లీడింగ్‌లో ఉన్నాయి.