విచారం వ్యక్తం చేసిన జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్..
ఉగ్రదాడిని ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాన్ ఖండించారు. పార్టీ జెండాను అవనతం చేసి, రాష్ట్రంలో మూడు రోజుల పాటు సంతాపదినాలు పాటించాలని పార్టీ శ్రేణులను కోరారు. శుక్రవారం రోజున ఉగ్రవాదానికి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా మానవహారాలు నిర్వహించాలని సూచించారు. "దాడి అమానుషం. ఉగ్రవాదానికి నాగరిక సమాజంలో స్థానం లేదు." అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
Update: 2025-04-23 07:57 GMT